నిరీహ రూపమై నిరాశ నిండినట్టి జన్మలో
కరావలంబమై సదూహ కాచె నన్ను, దివ్యమౌసరాగమాలపించు స్నేహసౌరభంపు పుష్పమై.
వరమ్ము వచ్చి నన్నుఁ జేరె వానవిల్లు సొంపుతో
-లక్ష్మీదేవి
పంచచామరము
అన్యమెఱుంగ, నీ పదములందు మదున్నతిఁగాంతు, నందె నా
ధన్యత నెంతు, యుక్తమగు ధారణఁ దారణయుక్తసూక్తులన్
మాన్యముఁబెంచు భావనల మన్నననిచ్చినఁ జాలునందు, సా
మాన్యను, నాదు విన్నపము మక్కువమీరగ నాలకింపుమా!
-లక్ష్మీదేవి.
ఉత్పలమాల
పలుకు, పదములందు పట్టునిచ్చినవారు,
సుఖము, శాంతి, కొరత, శోకమెల్ల
నదనుఁజూచి కూర్చి, పదనుఁదీర్చినవార
కెల్ల జోతలిడుదు నిందునెందు.
-ఆటవెలది.
లక్ష్మీదేవి.